
మనం ఎన్నో రకాల టూత్ పేస్టులను వాడుతుంటాం. కానీ ఏది వాడాలో అంతగా తెలియదనే చెప్పాలి. తెల్ల పేస్టులో క్యాల్షియం ఉంటుంది. దీనివల్ల మన దంతాలపైన ఒక పొరలాగా ఏర్పడి , దంతాల అరుగుదలను నిరోధించే విషయంలో ఉపయోగం ఉంటుంది…

టూత్‌పేస్ట్ ట్యూబ్ కింది భాగంలో ఉండే గీత నలుపు రంగులో ఉంటే ఆ టూత్‌పేస్ట్‌ను 100 శాతం కెమికల్స్‌తో తయారు చేశారని అర్థం. అదే ఆ గీత గ్రీన్ కలర్‌లో ఉంటే ఆ టూత్‌పేస్ట్ 100 శాతం సహజ సిద్ధమైందని తెలుస్తుంది.నీలి రంగులో గీత ఉంటే ఆ టూత్‌పేస్ట్‌ను సహజసిద్ధమైన, మెడికల్ పదార్థాలను కలిపి తయారు చేశారని తెలుసుకోవాలి. ఒక వేళ గీత ఎరుపు రంగులో ఉంటే ఆ టూత్‌పేస్ట్ సహజ సిద్ధమైన, కెమికల్ పదార్థాలతో తయారైందని తెలుస్తుంది.

ఇకపోతే టూత్ పేస్ట్ వలన థైరాయిడ్ సమస్యలు కలుగుతాయని వినగానే నిజం కాదేమో అని అనుకుంటాము. కానీ, క్రిములను నాశనం చేసే టూత్ పేస్ట్ లలో “ట్రిక్లోసెన్” అనే రసాయనాన్ని కలుపుతారు. మొదట్లో ఈ రసాయనాన్ని పెస్టిసైడ్ లలో వాడేవారు. ఈ రసాయనాన్ని కలిగి ఉన్న టూత్ పేస్ట్ లను వాడటం వలన థైరాయిడ్ సమస్యలు, గుండె సమస్యలు మరియు క్యాన్సర్ కలుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు.